విశాఖలో పీసీసీ చీఫ్ షర్మిల పర్యటన..! 4 h ago
AP : విశాఖలో పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించనున్నారు. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ జపం కాంగ్రెస్ చేస్తే తప్పేంటని అన్నారు. అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. అంబేద్కర్‌ను బీజేపీ అవమానపరిచిందని మండిపడ్డారు. నిరసనగా సాయంత్రం మౌనదీక్ష చేస్తానన్నారు. ఏపీని ప్రధాని మోదీ మోసం చేశారని విమర్శించారు. బీజేపీతో టీడీపీ, జనసేన సక్రమ సంబంధం పెట్టుకుంటే.. వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుందని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు.